: జల ప్రవేశం చేసిన యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ వజ్రకోశ్'
భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో నౌక వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వజ్రకోశ్ ను కేంద్ర రక్షణ మంత్రి జల ప్రవేశం చేయించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో కేంద్ర మంత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిసైల్స్ ను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన ఐఎన్ఎస్ వజ్రకోశ్ నౌకాదళంలో కీలకంగా మారే అవకాశం ఉందని రక్షణ మంత్రి అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడగల సామర్థ్యం ఐఎన్ఎస్ వజ్రకోశ్ సొంతమని, ఇందులో అత్యాధునిక యుద్ధ సామగ్రి సర్వసన్నద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నావికాదళ ప్రధానాధికారి ఆర్కే దోవల్ పాల్గొన్నారు.