: వరంగల్ జిల్లాలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గణపతి అదృశ్యం
వరంగల్ జిల్లాలో ఈరోజు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సెల్వ గణపతి అదృశ్యమయ్యాడు. సికింద్రాబాద్- మణుగూరు రైలులో వెళుతుండగా వరంగల్ జిల్లా కాజీపేట వద్ద అతను కనిపించకుండా పోయినట్టు తోటి కానిస్టేబుల్ వాల్య గుర్తించాడు. వెంటనే డోర్నకల్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఛత్తీస్ గఢ్ కుంటాలోని సుక్మా బెటాలియన్ లో గణపతి విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన స్వస్థలం తమిళనాడులోని థేని జిల్లా అందిపట్టి గ్రామం.