: హిందువులందరికీ మంచి జరగాలని ప్రార్థించా: తొగాడియా

ఇటీవల కేంద్ర ప్రభుత్వ నివేదికలో దేశంలో హిందువుల సంఖ్య తగ్గినట్టు తేలడంపై విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా హిందువులు 80 శాతం కంటే తగ్గారన్నారు. గతంలో ఎప్పుడూ ఈ శాతానికి తగ్గలేదని చెప్పారు. అయితే ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే హిందువుల మనుగడ కష్టమని తొగాడియా పేర్కొన్నారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 100 కోట్ల హిందువులకి మంచి జరగాలని తాను స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. దేశంలో అందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన తొగాడియా, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులపై జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అనవసర భారం మోపుతోందని అన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని మతాలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.

More Telugu News