: కేంద్ర ప్రాజెక్టుకు మాతా అమృతానందమయి భూరి విరాళం
'నమామి గంగే' పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుకు ఆధ్యాత్మిక వేత్త మాతా అమృతానందమయి దేవి భూరి విరాళం ప్రకటించారు. రూ.100 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 11న మాతా అమృతానందమయి మఠంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి వంద కోట్ల డీడీ అందజేయనున్నారు. ఈ మొత్తం విరాళాన్ని గంగా నది పరీవాహక ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు తమవంతు సాయంపై మార్చిలోనే ప్రధానితో అమృతానందమయి చర్చించినట్లు అమృతానందమయి మఠం తెలిపింది. ఇందుకుగానూ మోదీ కృతజ్ఞతలు చెప్పారని పేర్కొంది.