: చిత్తూరు జిల్లాలో బ్రిటానియా ప్రాసెసింగ్ యూనిట్
నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి, కార్యకలాపాలను ప్రారంభించడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించడానికి బ్రిటానియా కంపెనీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన బ్రిటానియా ఎండీ వరుణ్ బెర్రీ... బెంగళూరు మార్కెట్ అవసరాలను తీర్చేందుకు ఏపీలో యూనిట్ నెలకొల్పాలని భావిస్తున్నామని... అనువైన ప్రదేశాన్ని సూచించాలని కోరారు. దానికి సమాధానంగా చిత్తూరు జిల్లాలో యూనిట్ పెట్టమని చంద్రబాబు సూచించారు. దీంతో, రూ. 125 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని బ్రిటానియా తెలిపింది. మరోవైపు, డైరీ రంగంలో ఉన్నటువంటి అవసరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వరుణ్ కు చంద్రబాబు సూచించారు.