: మోదీ అశ్వమేధ అశ్వాన్ని కూల్చండి: సీతారాం ఏచూరి
రామాయణంలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శలు సంధించారు. బీహార్ లో సోమవారం నాడు జరిగిన వామపక్ష పార్టీల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టవద్దని ఓటర్లను ఏచూరి కోరారు. ఈ సందర్భంగా రామాయణంలోని అశ్వమేధ యాగం ఘట్టాన్ని ఉదహరించారు. అశ్వమేధ యాగ అశ్వాన్ని శ్రీ రామచంద్రమూర్తి కుమారులే అడ్డగించారని... అదే విధంగా మోదీ అశ్వమేధ అశ్వాన్ని బీహార్ రైతులు, కార్మికులు అడ్డగిస్తారని ఏచూరి జోస్యం చెప్పారు. ఇదే సమయంలో అధికార పార్టీ జేడీ(యు), దాని పొత్తు పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను కూడా ఓడించాలని సీతారాం ఏచూరి అన్నారు.