: రెండు ఫ్రంట్ కెమెరాలతో లెనోవో నుంచి కొత్త ఫోన్


లెనోవో సంస్థ తాజాగా వైబ్ ఎన్ 1 పేరుతో ఓ కొత్త ఫోన్ ని విడుదల చేసింది. జర్మనీలో జరుగుతున్న ఐఎఫ్ఏ కార్యక్రమంలో ఈ ఫోన్ ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. సెల్ఫీ ప్రియులకోసం ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఫోన్ కు వెనుక కెమెరా, రెండు ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. మరింత మెరుగైన సెల్ఫీలు తీయడానికి ఈ రెండు ఫ్రంట్ కెమెరాలు ఉపయోగపడతాయని లెనోవో తెలిపింది. గతంలో హెచ్ టీసీ సంస్థ నుంచి ఇలాంటి రెండు ఫ్రంట్ కెమెరాలున్న ఫోన్ ఒకటి విడుదలైంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 13 మెగా పిక్సల్ కెమెరా, 8 మెగా పిక్సల్, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, 3జీబీ ర్యామ్ ఉన్నాయి. దీని ధర దాదాపుగా రూ.20వేలు ఉంటుంది.

  • Loading...

More Telugu News