: ఈసారి యుద్ధం వస్తే పాక్ ను నాలుగు ముక్కలు చేస్తాం: సుబ్రహ్మణ్యస్వామి
అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ చేస్తున్న కార్యకలాపాలు సహించలేని విధంగా తయారయ్యాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. వాస్తవానికి భారత్ యుద్ధం కోరుకోవడం లేదని... అందుకే సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. మరోసారి యుద్ధమే వస్తే కనుక, పాకిస్థాన్ ను నాలుగు ముక్కలు చేస్తామని హెచ్చరించారు. గతంలోనే పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనకు సంపూర్ణ ఆత్మ విశ్వాసం ఉందని... పాకిస్థాన్ కు పూర్తి భయం ఉందని చెప్పారు. పాక్ నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతోందని అన్నారు.