: మాకూ ఓఆర్ఓపీ ఇవ్వండి... మోదీకి రైల్వే కార్మికుల లేఖ

దేశంలో మాజీ సైనికులకు 'వన్ ర్యాంక్- వన్ పెన్షన్' (ఓఆర్ఓపీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దానికోసం రైల్వే కార్మికులు ముందుకొచ్చారు. రైల్వే కార్మికులకు ఓఆర్ఓపీ వర్తింపచేసేలా పథకాన్ని రూపొందించాలని 'నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్' (ఎన్ఎఫ్ఐఆర్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఈ రెండు డిమాండ్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. రైల్వేలోని 13.2 లక్షల మంది రైల్వే కార్మికులు సైన్యం తరహాలోనే దేశ సేవ చేస్తున్నారని ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య అన్నారు. అందుకే వారికి కూడా ఓఆర్ఓపీని అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు.

More Telugu News