: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు రాబట్టిన స.హ కార్యకర్త

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నరేంద్ర మోదీ పలు దేశాల్లో పర్యటనలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలకు ఎంత ఖర్చయిందన్న విషయాన్ని సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి ఓ వ్యక్తి బయట పెట్టాడు. ప్రధాని పర్యటనల నిమిత్తం రూ. 37 కోట్లు ఖర్చుకాగా, అత్యధికంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఖర్చయింది. మొత్తం 20 దేశాల్లో మోదీ పర్యటనలు సాగగా, భూటాన్ పర్యటనకు కేవలం రూ. 41.33 లక్షల ఖర్చయింది. ప్రధాని హోటల్ బసల నిమిత్తం రూ. 5.60 కోట్లు, కారు అద్దెల నిమిత్తం రూ. 2.40 కోట్లు వెచ్చించినట్టు, స.హ చట్టం ఆధారంగా వచ్చిన దరఖాస్తుకు ప్రధాని కార్యాలయం బదులిచ్చింది. కాగా, మోదీ అమెరికా సహా జర్మనీ, ఫిజీ, చైనా, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.

More Telugu News