: ఇప్పటికైనా తీరు మార్చుకోండి... బీసీసీఐ వెంటపడొద్దు: పీసీబీకి మియాందాద్ సూచన

టీమిండియాతో సిరీస్ కోసం పాకులాడుతున్న పాకిస్థాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరిపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ చిర్రుబుర్రులాడాడు. పొద్దాకా బీసీసీఐ వెంట పడతారెందుకు? అంటూ నిలదీశాడు. బీసీసీఐని వదిలి ఇతర దేశాల జట్లతో సిరీస్ లపై దృష్టి సారించాలని అతడు బోర్డుకు సూచించాడు. ‘‘భారత నాయకుల ప్రకటనలు ఇరు దేశాల క్రీడా సంబంధాల పునరుద్ధరణకు దోహదం చేయడం లేదు. ఇప్పటికైనా బీసీసీఐ పట్ల పీసీబీ తన వైఖరిని మార్చుకుని ఇతర దేశాలతో సిరీస్ నిర్వహణపై దృష్టి పెట్టాలి’’ అని అతడు వ్యాఖ్యానించాడు.

More Telugu News