: మాజీ సైనికుల దీక్ష విరమణ

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సాధన కోసం గత మూడు నెలలుగా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన మాజీ సైనికులు ఆదివారం నాడు విరమించారు. మాజీ సైనికుల నేత సత్బీర్ సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. పెండింగ్ డిమాండ్లను పరిష్కరించకపోతే మరోసారి తమ తడాఖా చూపిస్తామని, నిరాహార దీక్షలు చేపడతామని కూడా వారు హెచ్చరించారు. అయితే తాము పేర్కొన్న పూర్తి డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం ప్రకటనపై ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మాజీ సైనికులు కృతఙ్ఞతలు తెలిపారు.

More Telugu News