: ఎన్నో పెద్ద ఆఫర్లు వచ్చాయి... కానీ, నాన్నకు ఇచ్చిన మాట కోసం వాటిని పట్టించుకోలేదు: సచిన్
తన తండ్రి అంటే ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సార్లు చెప్పాడు. తాజాగా తన తండ్రి మాటకు తాను ఎంతగా కట్టుబడి ఉండేవాడినో సచిన్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్ ఆరంభంలోనే మద్యం, పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని తన తండ్రి తనకు చెప్పారని... ఆయన మాటకు కట్టుబడి ఎన్నో పెద్ద కంపెనీల ఆఫర్లు వచ్చినా, వాటిని తిరస్కరించానని సచిన్ వెల్లడించాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రకటనల్లో కనిపించనని స్పష్టం చేశాడు. దీంతోపాటు, ఏ కెరీర్ ఎంచుకున్నా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని... వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళితే, గొప్ప వాళ్లుగా ఎదుగుతామని యువతకు సూచించాడు.