: యాచకురాలికి చంద్రబాబు ఇచ్చిన డబ్బెంతో తెలుసా?

ఈ ఉదయం విశాఖపట్నంలో రెండో రోజు పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ముందు ఓ వృద్ధ యాచకురాలు చేయి చాచగా, ఆయన తన జేబు నుంచి కొన్ని కరెన్సీ నోట్లను లెక్కించకుండానే ఆమె చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని ఆ యాచకురాలు లెక్కించగా, రూ. 2 వేలు ఉన్నాయట. ఈ విషయాన్ని ఆమె సంబరంగా మీడియాకు తెలిపింది. కాగా, విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆయనకు, వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పోటీ పడ్డారు. చంద్రబాబు విశాఖ పర్యటన కొనసాగుతోంది.

More Telugu News