: రక్తాలు కారేలా కొట్టుకున్న అమెరికా సైనికులు
అమెరికా క్యాడెట్లు రక్తాలు కారేలా కొట్టుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత యూఎస్ మిలటరీ అకాడమీలో వేసవి శిక్షణ ముగించుకున్న క్యాడెట్లు సరదాగా దిండ్లతో కొట్టుకుంటారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయానికి కాస్త రాక్షసత్వం తోడవడంతో కొందరు క్యాడెట్లు దిండ్లలో గట్టి పదార్థాలు కుక్కారు. దీంతో ఈ సంప్రదాయం ఉద్రిక్తంగా మారింది. రక్తాలు కారేలా కొట్టుకోవడంతో 30 మంది గాయపడ్డారు. గాయపడిన క్యాడెట్లకు చికిత్స అందిస్తున్న అధికారులు, దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. సంప్రదాయంగా వస్తున్న దిండ్ల కొట్లాట రక్తసిక్తమయిందని అధికారులు ప్రకటించారు. క్యాడెట్లు గాయపడడంపై దర్యాప్తు మొదలు పెట్టామని అన్నారు.