: ఆంధ్రాకు మరిన్ని విద్యా సంస్థలు: మంత్రి గంటా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని విద్యా సంస్థలు రానున్నట్లు మంత్రి గంటా తెలిపారు. విశాఖపట్ణణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య విద్యార్థిగా ఉండటంతో పాటు ఎన్నుకునే రంగంపై స్పష్టత ఉండాలని అన్నారు. ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల శ్రద్ధ కనపర్చాలని అన్నారు. విద్యతో పాటు వైద్య రంగం రాష్ట్రానికి ప్రధానమైనదని గంటా పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొన్నారు.

More Telugu News