: కేసీఆర్ చైనా పర్యటనలో స్వల్ప మార్పు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీన కేసీఆర్ చైనా పర్యటనకు బయల్దేరాల్సి ఉండగా, దానిని ఒకరోజు ముందుకు జరిపారు. దీంతో ఈ నెల 7వ తేదీన కేసీఆర్ బృందం చైనా బయల్దేరనుంది. సీఎం కేసీఆర్ వెంట శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు జూపల్లి, జగదీశ్వర్ రెడ్డి, అధికారుల బృందం వెళ్లనుంది. ఈ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ సదస్సులో ఈ బృందం పాల్గొంటుంది. అలాగే పర్యటనలో భాగంగా షాంగై, బీజింగ్, షెంజాన్ నగరాల్లో కేసీఆర్ బృందం పర్యటించనుంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ బృందం చైనాలో పర్యటిస్తోంది.