: మృతదేహమని ఎవరికీ అనుమానం రాకూడదనే అలా చేశా!: ఇంద్రాణి

షీనా బోరాను హత్య చేసిన అనంతరం ఆ మృతదేహానికి తల దువ్వి, లిప్ స్టిక్ వేసి, అత్తరు కొట్టి చక్కగా ముస్తాబు చేసి కారులో తీసుకువెళ్లానని, మాతృత్వానికే మచ్చ తెచ్చిన ఇంద్రాణి ముఖర్జీయా చెప్పింది. కూతురుని హత్య చేసిన కేసులో ఇంద్రాణి నుంచి మరిన్ని విషయాలను విచారణలో రాబట్టారు. ఎందుకు ఈ విధంగా చేసారన్న ప్రశ్నకు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఈ విధంగా చేశానని ఆమె సమాధానమిచ్చినట్టు ఓ అధికారి తెలిపారు. మార్గమధ్యంలో పోలీసు తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న షీనా గురించి వారు ప్రశ్నించగా ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో నిద్రపోతోందని ఇంద్రాణి చెప్పిందని ఆ అధికారి పేర్కొన్నారు.

More Telugu News