: ఈసారి బాలయ్య ఫ్యాన్స్ వంతు... ఏలూరులో ఫ్లెక్సీల చింపివేతపై నందమూరి అభిమానుల ఆందోళన
సినీ నటుల అభిమానుల ఆగ్రహావేశాలకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా మారింది. ఇప్పటికే ఆ జిల్లాలోని భీమవరం మూడు రోజులుగా నిప్పుల కుంపటిలా కాగిపోతోంది. పవన్ కల్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తాజాగా జిల్లా కేంద్రం ఏలూరులో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలయ్య ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు వారు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో మోహరించారు. నందమూరి ఫ్యాన్స్ ఆందోళన, పోలీసుల మోహరింపు నేపథ్యంలో ఏలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.