: యూఎస్ ఓపెన్ లో నాదల్ కు షాక్... మూడో రౌండ్ లోనే నిష్క్రమణ

టెన్నిస్ లో మట్టి కోర్టు రారాజుగా వెలుగొందుతున్న రఫెల్ నాదల్ కు యూఎస్ ఓపెన్ లో షాక్ తగిలింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అతడు మూడో రౌండ్ లోనే ఇంటి దారి పట్టక తప్పలేదు. కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ రఫెల్ నాదల్, 32 వ సీడ్ ఫాబియో ఫోగ్నిని చేతిలో ఘోర పరాజయం చవిచూశాడు. ఐదు సెట్ల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లను నాదల్ కైవసం చేసుకున్నా, ఆ తర్వాత ఫోగ్నిని దెబ్బకు చిత్తయ్యాడు. 3-6, 4-6, 6-4, 6-3, 6-4 స్కోరుతో ఫోగ్నిని, నాదల్ పై విజయభేరి మోగించి నాలుగో రౌండ్ కు చేరుకోగా, నాదల్ మాత్రం మూడో రౌండ్ తోనే ఇంటి దారి పట్టాడు.

More Telugu News