: భారత్ ను కొనియాడిన చైనా
భారతదేశాన్ని చైనా కొనియాడింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ జరిపిన విజయోత్సవాలకు భారత్ హాజరుకావడంపై చైనా హర్షం వ్యక్తం చేసింది. 70వ విజయోత్సవాలను చైనా ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు విదేశాంగ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ హాజరయ్యారు. చైనా విజయోత్సవ వేడుకలకు భారత్ హాజరుకావడం రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని ఆ దేశం అభిప్రాయపడింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయోత్సవ వేడుకలకు భారత్ హాజరు కావడాన్ని అభినందించారు.