: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన టీపీసీసీ చీఫ్
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడిని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాపరిషత్ సమావేశంలో రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయడం అమానుషమని అన్నారు. దాడికి నిరసనగా రేపు మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడిపై శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నామని ఆయన తెలిపారు. కాగా, జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా రామ్మోహన్ రెడ్డిపై దాడి చేసిన అనంతరం అతనిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని బాలరాజు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.