: ‘ఎర్ర’ గోడౌన్ వద్ద కానిస్టేబుల్ సూసైడ్... ఘటనపై పలు అనుమానాలు

చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఏపీఎస్పీ విభాగానికి చెందిన కానిస్టేబుల్ సంతోశ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆయుధంతో కాల్చుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఎస్పీ 9వ బెటాలియన్ కు చెందిన సంతోశ్ శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వ్యక్తి. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను రేణిగుంట పరిధిలోని ఓ గోడౌన్ లో భద్రపరిచారు. ఈ గోడౌన్ సెక్యూరిటీ బాధ్యతను చేపట్టిన ఏపీఎస్పీ ఉన్నతాధికారులు సంతోశ్ తో పాటు మరికొంత మందిని అక్కడ విధులకు పంపారు. అయితే నిన్న రాత్రి దాకా బాగానే ఉన్న సంతోశ్ తెల్లారేసరికి విగత జీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న అతడి తల్లిదండ్రులు తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు. ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News