: సిద్ధాంతం, దువ్వలో ‘సూది’గాడి సంచారం... చెప్పులు, సిరంజీ వదిలి పరార్
పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు పట్టుకున్న సైకో ‘సూది’గాడి భయం వీడటం లేదు. పోలీసులు రాత్రింబవళ్లు గాలింపు జరుపుతున్నా సైకో ఆచూకీ లభించడం లేదు. తాజాగా నిన్న రాత్రి జిల్లాలోని సిద్ధాంతం, దువ్వ ప్రాంతాల్లో సైకో సంచరించినట్లు పోలీసులకు సమాచారం అందింది. సిద్ధాంతంలో సైకో సంచారాన్ని పసిగట్టిన ఓ యువకుడు అతడిని పట్టుకునేందుకు యత్నించాడు.
అయితే యువకుడిపై దాడి చేసేందుకు వచ్చిన సైకో, తననే ఆ యువకుడు బంధించేందుకు యత్నించడంతో బెంబేలెత్తిపోయినట్లు సమాచారం. దాడి కోసం తెచ్చుకున్న సిరంజీని, చెప్పులను కూడా అక్కడే వదిలి పరారయ్యాడు. ఇదిలా ఉంటే, గత నెల 26 తర్వాత జిల్లాలో ఎక్కడా కూడా సైకో దాడులు నమోదు కాలేదని జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ చెప్పడం గమనార్హం.