: ఇకపై పక్షవాత రోగులూ నడవొచ్చు!

కాళ్లకు పక్షవాతం వచ్చి ఇక నడవలేమనుకునేవారికి ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే, వాళ్లు నడిచేందుకు 'రోబోటిక్ ఎక్సోస్కెలెటన్'గా పిలిచే ఓ రోబో సూట్ ను అమెరికాకు చెందిన పరిశోధకులు కనిపెట్టారు. పక్షవాత రోగి వెన్నెముకను ఉత్తేజపరిచి, వారు నడిచేలా చేయడంలో రోబో సూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన ఈ రోబో సూట్ ను పక్షవాతం బారిన పడిన మాజీ అథ్లెట్ కు ధరింప చేసి నడిపించినట్లు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు.

More Telugu News