: తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమే: విద్యాబాలన్
'డర్టీ పిక్చర్' నటి విద్యాబాలన్ తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. చిన్నప్పుడు తన మామ హైదరాబాదులో ఉండేవారని, అప్పుడు గోల్కొండ కోటను చూశానని విద్యాబాలన్ చెప్పింది. బాహుబలి, మగధీర సినిమాలు చూశానని చెప్పిన విద్యాబాలన్, మంచి స్క్రిప్టు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. గతంలో తెలుగు సినిమాల్లో చేయమని పలు అవకాశాలు వచ్చాయని, అయితే పలు కారణాలతో వాటిలో నటించలేదని విద్యాబాలన్ చెప్పింది. మలయాళం, తెలుగు సినిమాల్లో నటించాలని ఉండేదని విద్యాబాలన్ వెల్లడించింది. బాహుబలి రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపింది.