: ప్రజల నిర్ణయం మేరకే చీప్ లిక్కర్ ను సీఎం పక్కనబెట్టారు: కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మనిషి అని ఆయన కుమార్తె, ఎంపీ కవిత అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించే, చీప్ లిక్కర్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పక్కన పెట్టారని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణకు అర్థం ఉంటుందని చెప్పారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నిజామాబాద్ ప్రజల తాగునీటి కష్టాలు తీరిపోతాయని ఆమె తెలిపారు.

More Telugu News