: ప్రమాదంలో పడింది బీజేపీయే: శ్రీనివాసగౌడ్
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందంటూ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రమాదంలో పడింది బీజేపీయేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కిషన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు నిధులు రప్పించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. నిధుల కోసం కేంద్రాన్ని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.