: స్మితా సబర్వాల్ వ్యక్తిగత వివాదానికి ప్రభుత్వ సాయమా?: హైకోర్టును ఆశ్రయించిన వత్సల

ఓ ప్రైవేటు కార్యక్రమం గురించి ఆంగ్ల దినపత్రిక ఒకటి కథనం రాస్తే, దానిపై పోరాడేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ కు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 15 లక్షలు మంజూరు చేయడాన్ని రచయిత, సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్మితా సబర్వాల్ లను ప్రతివాదులుగా పేర్కొంటూ, ఆమె వ్యక్తిగత వ్యవహారంలో ప్రజాధనాన్ని మంజూరు చేయడాన్ని ప్రశ్నించారు. ఇలా నిధులివ్వడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, ఇటీవల 'అవుట్ లుక్' పత్రిక, స్మిత గురించి ఓ అభ్యంతరకర కార్టూన్, కథనాన్ని ప్రచురించగా, ఆ పత్రికపై స్మిత రూ. 10 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

More Telugu News