: జగన్ దీక్షలో నిబద్ధత లేదు: చంద్రబాబు

ప్రతి అభివృద్ధి పనినీ వ్యతిరేకించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి యత్నించారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టును కూడా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం జగన్ చేసిన దీక్షలో నిబద్ధత లేదని ఎద్దేవా చేశారు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారమే సాధించుకోవాలని, కానీ ఈ విషయంలో జగన్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడిన సీఎం... జగన్ తీరును తప్పుబట్టారు. విభజనపై పార్లమెంటులో మాట్లాడకపోవటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదాపై రోడ్ మ్యాప్ తయారవుతోందని, ఈ సమయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. జగన్ స్వగ్రామానికి కూడా నీరిచ్చి చూపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News