: కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగని స్టాక్ మార్కెట్ పతనం

విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా పతనాన్ని చవిచూశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... బీఎస్ఈ సెన్సెక్స్ 243 పాయింట్లు కోల్పోయి 25,454కు పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు పతనమై 7,717కు చేరింది. గ్లోబల్ మార్కెట్లన్నీ కూడా ఈ రోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇవాల్టి టాప్ గెయినర్స్ లో బలరాంపూర్ చీని మిల్స్ (7.92%), సన్ టీవీ నెట్ వర్క్ (7.64%), శ్రీ రేణుకా షుగర్స్ (6.74%), కేఈసీ ఇంటర్నేషనల్ (6.59%), శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ (5.30%) ఉన్నాయి. టాప్ లూజర్స్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.43%), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (5.10%), సన్ రైజ్ ఏషియన్ లిమిటెడ్ (4.92%), పిరమల్ ఎంటర్ ప్రైజెస్ (4.64%), శోభ లిమిటెడ్ (4.62%).

More Telugu News