: ఘనంగా వైఎస్ ఆరో వర్ధంతి... ఇడుపులపాయలో జగన్ నివాళి

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. నేటి ఉదయం తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతిలతో కలిసి తన సొంత ఎస్టేట్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకున్న జగన్, తన తండ్రికి ఘన నివాళి అర్పించారు. ఉమ్మడి రాష్ట్రానికి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. వైఎస్ ఆరో వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు.

More Telugu News