: మోదీజీ... బీహార్ కు కొత్త హామీలు ఇవ్వకండి!: నితీశ్ కుమార్

బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కొన్ని సూచనలు చేశారు. ఇప్పటివరకు తమ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. అంతేగానీ కొత్త హామీలు ఇవ్వొద్దని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇంతవరకు ఇచ్చిన హామీలను నెరవేర్చి బీహార్ కు నైతిక ధైర్యాన్ని ఇస్తే చాలన్నారు. అంతేగాక 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు బీజేపీ సీట్లు కేటాయించకూడదని కూడా గుర్తు చేశారు.

More Telugu News