: రామోజీరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన శ్రీశ్రీ విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఒడిశాలోని కటక్ లో ఉన్న శ్రీశ్రీ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయనతో పాటు నేపాల్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వినోద్ చౌదరి, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త మహేష్ గుప్తాలకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ రెండవ స్నాతకోత్సవం ఈ రోజు జరిగింది. దీనికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ప్రదీప్ పాణిగ్రాహి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం వ్యవస్ధాపకుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్, పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.