: డెయిరీ రంగంలోకి అడుగిడనున్న ఐటీసీ... నెలాఖరుకు మార్కెట్లోకి నెయ్యి

పొగాకు ఉత్పత్తుల తయారీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ డెయిరీ రంగంలోకి అడుగు పెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని కంపెనీ ప్రెసిడెంట్ (ఎఫ్ఎంసీజీ) సంజీవ్ పూరి నిన్న ప్రకటించారు. డెయిరీ రంగంలో తమ తొలి ఉత్పత్తిగా నెయ్యిని ఈ నెలాఖరు నాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే ప్యాకేజ్డ్ మిల్క్, వెన్న, చీజ్, చాక్లెట్లను కూడా మార్కెట్లోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. డెయిరీ రంగంలోని అపార అవకాశాలను చేజిక్కించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పూరి చెప్పారు.

More Telugu News