: హత్యా సంస్కృతి రాజశేఖర్ రెడ్డి, జగన్ లదే: మంత్రి పల్లె
వైకాపా అధినేత జగన్ పై ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు. జగన్ ఒకే లక్ష్యంతో ఉన్నారని... ముఖ్యమంత్రి కావడం, దోచుకున్న లక్షల కోట్లను దాచుకోవడం ఇదే జగన్ లక్ష్యమని అన్నారు. జనాలను చంపే సంస్కృతి చంద్రబాబుది కాదని... ఆ సంస్కృతి వైయస్ రాజశేఖరరెడ్డి, జగన్ లదే అని చెప్పారు. శాసనసభలో కూడా జగన్ వెకిలిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సంతాప తీర్మానాల సమయంలో కేకలు వేయడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం దారుణమని అన్నారు.