: పెట్రోలు బంకుల బంద్ నేపథ్యంలో... ఏపీలో రూ. 120కి చేరిన లీటరు పెట్రోల్ ధర!

పెట్రోలుపై విలువ ఆధారిత పన్నుతో పాటు ఇతర టాక్స్ లను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, బంకుల యజమానులు చేపట్టిన బందుతో లీటరు పెట్రోలు ధర రెట్టింపైంది. వాహనదారుల అవసరాలను గమనించి, ముందుగానే స్టాక్ పెట్టుకున్న కొందరు దళారులు లీటరు పెట్రోలును రూ. 120కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోలు బంకుల డీలర్లు పన్నులు తగ్గించాలంటూ ఒకరోజు బంద్ ను నేడు తలపెట్టిన సంగతి విదితమే.

More Telugu News