: కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరుషి నియామకం... రిటైర్ అయిన వెంటనే కీలక పోస్టింగ్
కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ఏసీ గోయల్ స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ మెహరుషి నియమితులయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న మెహరుషి ఈ రోజే పదవీ విరమణ చేశారు. ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయిన మరుక్షణమే రాజీవ్ మెహరుషికి మోదీ సర్కారు కీలక శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 1978 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన రాజీవ్... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో పలు కీలక పోస్టుల్లో పనిచేశారు.