: ఏపీ అసెంబ్లీలో వింత... అధికార పక్షం నోట ‘ప్రొటెస్ట్’ మాట!

ఏపీ అసెంబ్లీలో వింతలు, విశేషాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పక్ష స్థానంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై విపక్షాలు నిరసన తెలపడం మనకు తెలిసిందే. అయితే అధికార పక్షమే నిరసన వ్యక్తం చేస్తే, వింతే కదా? అలాంటి ఘటనే నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు మూకుమ్మడి దాడికి దిగారు. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. విపక్ష నేత వ్యాఖ్యలపై తాను ‘ప్రొటెస్ట్’ చేస్తున్నానని ఆయన ప్రకటించారు.

More Telugu News