: ఆ భూములను పరిశ్రమలకు అప్పగించడం సరికాదు: సీపీఎం మధు

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయడం హర్షణీయమని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, థర్మల్ విద్యుత్ కేంద్రం రద్దు చేసినప్పుడు ఆ భూములను రైతులకే అప్పగించి ఉంటే బాగుండేదని అన్నారు. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆ భూములు కేటాయిస్తామని మంత్రి వర్గం చెప్పడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ భూములను స్థానికంగా సాగుచేసుకుంటున్న రైతులకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. 2,094 రోజులపాటు దీక్షలు నిర్వహించిన స్థానిక ప్రజలను ఆయన అభినందించారు. సుదీర్ఘకాలం పోరాటం చేయడం సాధ్యం కాదని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని వారి పోరాటాన్ని ఆయన కొనియాడారు. భూపోరాటాలకు సోంపేట ఘటన స్పూర్తిదాయకమన్న ఆయన, ఇది చరిత్రలో అరుదైన సంఘటన అని పేర్కొన్నారు.

More Telugu News