: బాలీవుడ్ టాక్... అమితాబ్ కామెంట్ కు అలియా భట్ కౌంటర్
తన అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యమూ దగ్గరగా ఉండే బిగ్ బీ, కొన్నికొన్ని సార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారన్న సంగతి తెలిసిందే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలో తెరంగేట్రం చేసిన అలియా భట్, ట్విట్టర్లో పెట్టిన ఓ కామెంట్ కు అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందిస్తే, ఆ వెంటనే ఆమె కూడా కౌంటర్ వేసింది. ఇంతకీ ఈ కామెంట్లు ఏంటంటే, "అవకాశం వస్తే నేను డ్యాన్సర్ లేదా యాక్టింగ్ టీచర్ కావాలని ఉంది" అని అలియా పోస్ట్ చేయగా, "నేను నీకు విద్యార్థిని అవుతా" అంటూ అమితాబ్ స్పందించారు. దీన్ని చూసిన ఆమె "మీరే పెద్ద యాక్టింగ్ ఇనిస్టిట్యూషన్ ... స్టూడెంట్ గా మారతానంటారా?" అంటూ ట్వీటింది. అదీ అమితాబ్, అలియాల ట్వీట్ల టాపిక్! వీరి ట్వీట్లపై ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.