: చిరంజీవి అలాంటి వాడు కాదంటున్న సుమన్!

చిరంజీవి స్వభావం మంచిదని సినీ నటుడు సుమన్ చెప్పారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ, తన కెరీర్ లో సంభవించిన ఒడిదుడుకులకు, చిరంజీవికి సంబంధం లేదని అన్నారు. తమపై జరిగిన ప్రచారమంతా, తామిద్దరం కెరీర్ లో మంచి దశకు చేరుతున్నప్పుడు జరిగిందని, అది చూడలేక అసూయతో ఎవరో పుట్టించిన పుకార్లివని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి కష్టపడి పైకి వచ్చారని, ఆన్ స్క్రీన్ లో తెలుగు సినిమాలకు ఏం కావాలో అవన్నీ చిరంజీవి ఇచ్చారని సుమన్ చెప్పారు. తనను ఇబ్బందుల్లోకి నెట్టాల్సిన అవసరం చిరంజీవికి లేదని సుమన్ తెలిపారు. చిరంజీవి, తాను కలిసి స్టాలిన్ లాంటి సినిమాలో నటించామని, చిరు 150వ సినిమాలో మంచి పాత్ర ఉంటే కలిసి నటించేందుకు సిద్ధమని సుమన్ ఉత్సాహంగా చెప్పారు.

More Telugu News