: సుమన్ తెరపైనే కాదు ...'రియల్' హీరో కూడా... అందుకు తార్కాణమే ఈ సంఘటన!: కోడి రామకృష్ణ

సుమన్ కేవలం సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అని ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. అందుకు తార్కాణంగా ఓ సంఘటనను కూడా చెప్పారు. సుమన్ తొలి సినిమా తరంగణి షూటింగ్ వేరే స్పాట్ కు తరలిస్తూ యూనిట్ మొత్తం ఓ కారులో వెళ్తుండగా ఓ యువతిని ఐదుగురు యువకులు అల్లరి చేస్తున్నారు. ఆ సమయంలో సుమన్ ప్రయాణిస్తున్న కారు అటుగా వెళ్తుండడంతో కారు ఆపి, యువకులు చేస్తున్నది తప్పు అని చెప్పారు. దీంతో వాళ్లు ఐదుగురు యువతిని వదిలి సుమన్ పై కలబడ్డారు. ఇద్దరు సుమన్ ను కొట్టడంతో కరాటే తెలిసిన సుమన్ పొజిషన్ తీసుకుని వారిద్దరినీ కుమ్మేశాడు. మూడోవాడు కూడా రావడంతో వాడినీ ఉతికేశాడు. దీంతో మిగిలిన ఇద్దరూ తోకముడిచి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. దీంతో బాగా భయపడిపోయిన ఆ యువతిని సుమన్ దగ్గర్లో ఉన్న ఆర్మీ క్యాంపులో అప్పగించి, వారి తల్లిదండ్రులకు అప్పగించమని సూచించి యూనిట్ తో కలిసిపోయాడని దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పారు. అది ఓ బ్రిడ్జి దగ్గర జరిగిందని, యువతిని బ్రిడ్జ్ కిందికి లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా చోటుచేసుకున్న సంఘటన అని గుర్తు చేసుకున్నారు.

More Telugu News