: చంద్రబాబునాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. "రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ ట్విట్టర్లో స్పందించారు. అదే విధంగా, రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. రాజధాని కోసం బలవంతంగా భూములను తీసుకోరాదని కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సూచించిన సంగతి తెలిసిందే. పవన్ కోరిక మేరకు ఈరోజు ఏపీ ప్రభుత్వం భూసేకరణ ఉత్తర్వును ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన కృతజ్ఞతలను తెలియజేశారు.