: తెలుగుతేజం సింధుకు ఘన సన్మానం

భారత బ్యాడ్మింటన్ రంగంలో సైనా నెహ్వాల్ తర్వాత ఎవరన్న ప్రశ్నకు ఎవరైనా, పీవీ సింధు అనే బదులిస్తారు. ఇటీవల కాలంలో ఆటకు గణనీయంగా మెరుగులు దిద్దుకున్న ఈ తెలుగుతేజం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. తాజాగా, ఆమె ప్రతిభను గుర్తిస్తూ కోల్ కతా చాంబర్ ఆఫ్ కామర్స్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమానికి దేశ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింధుకు ఏజేఎన్ అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు కూడా బహుకరించారు. సన్మానం సందర్భంగా, సింధు తన భవిష్యత్ కార్యాచరణ వివరించింది. ఒలింపిక్స్ లో పతకం సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది.

More Telugu News