: "ఆఫ్టరాల్" అనలేదు... పవన్ వక్రీకరించారు: రావెల

ఏపీ రాజధాని భూసేకరణ విషయంలో తానేమీ అనుచితంగా వ్యాఖ్యానించలేదని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు స్పష్టం చేశారు. భూములు ఇవ్వని రైతులను ఉద్దేశించి తాను "ఆఫ్టరాల్" అనలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వక్రీకరించారని ఆరోపించారు. తాను మాట్లాడిన విషయాలను ఆయన సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు గౌరవమని, టీడీపీకి జనసేన పార్టీతో విభేదాలు లేవని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎస్సీ హాస్టల్ సందర్శన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవిధంగా పేర్కొన్నారు.

More Telugu News