: మోదీకి దమ్ముంటే మన్మోహన్ కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయాలి: సి.రామచంద్రయ్య
ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆత్మహత్యలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను ఢిల్లీకి ఎందుకు తీసుకువెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించడం చేతకాకపోతే వెంకయ్యనాయుడు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీకి దమ్ముంటే మన్మోహన్ కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయాలని... లేకపోతే, బిల్లు పెట్టి ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి చట్టబద్ధత కల్పించాలని అన్నారు.