: వైకాపా ఎమ్మెల్యే సోదరుడి ఆకస్మిక మృతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ సోదరుడు మున్వర్ ఖాన్ (56) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. వన్ టౌన్ లోని తారాపేటలో నివాసం ఉంటున్న ఆయనకు ఈ ఉదయం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, తన నివాసంలోనే కన్నుమూశారు. మున్వర్ ఖాన్ ఆకస్మిక మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వైకాపా వ్యాఖ్యానించింది. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ నేత జగన్ సంతాపం తెలిపారు.