: వరలక్ష్మీ వ్రతం రోజున తెలంగాణలో అతివలకు తీవ్ర నిరాశ!
మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం రోజున తెలంగాణలో మహిళలకు నిరాశ ఎదురవుతోంది. వ్రతం చేసుకునేందుకు ఉదయాన్నే వివిధ గుళ్లకు పూజాసామాగ్రితో సహా చేరుకున్న మహిళలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. తెలంగాణలో అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరగా, వ్రతాలు జరిపించేందుకు పూజారులు నిరాకరిస్తుండటమే ఇందుకు కారణం. ప్రధానంగా దేవాదాయ శాఖ నిర్వహణలోని ఆలయాల్లో మహిళల వ్రతాలు సాగడంలేదు. ఇప్పటికే కల్యాణాది ఆర్జిత సేవలు నిలిచిపోగా, ఇప్పుడు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలపైనా ప్రభావం పడింది. అమ్మవారిని మనసారా పూజించుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని అతివలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.