: ప్రపంచ అథ్లెటిక్స్ లో డిస్క్ త్రో ఫైనల్ కు చేరిన వికాస్ గౌడ
చైనా రాజధాని బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ డిస్క్ త్రోలో భారత్ క్రీడాకారుడు వికాస్ గౌడ ఫైనల్ కు చేరాడు. ఈ రోజు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో గ్రూప్-ఏలో 63.86 మీటర్లతో నాలుగో స్థానం సంపాదించాడు. దాంతో ఎల్లుండి జరగనున్న ఫైనల్స్ కు అర్హత సాధించాడు. డిస్క్ త్రోలో వికాస్ వ్యక్తిగత రికార్డు 66.28 మీటర్లుగా ఉంది. ఈ స్థాయిలో ప్రదర్శిస్తే స్వర్ణ పతకం సాధించే అవకాశాలున్నాయి.